చూడటానికి సన్నగా, పొడుగ్గా ఉండే ములుగ కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కాయలే కాదు.. ములగ ఆకు కూడా దివ్య ఔషధంగా పని చేస్తుంది. అవేంటో చూద్దాం
శరీరానికి నీరు పట్టినప్పుడు ములగాకులు కొన్నాళ్లపాటు ఆహారంగా తింటే నీరు లాగేస్తుంది.
బాలింతలు ములగ ఆకులు తింటే తల్లిపాలు పెరుగుతాయి. అన్నిరకాల వాత వ్యాధుల్లోనూ ములగ ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.
ములగ ఆకుల రసంలో చారుపొడి వేసి రసం కాచి తాగితే తరచూ వచ్చే కడుపు నొప్పి, అజీర్తి, అగ్ని మాంద్యం తగ్గుతాయి.
శరీరంలో వాపులు, నొప్పులు, కీళ్లవాతం మొదలైన వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా ములగ ఆకులు తినాలి. వ్యాధి లక్షణాలు త్వరగా తగ్గుతాయి.