షాకింగ్: ఏటా 50 సెంటీ మీటర్లు భూమిలోకి కుంగిపోతున్న మహానగరం!!

మెక్సికో రాజధాని అయిన మెక్సికో మహానగరం భూమిలోకి కుంగిపోతోంది.
ఇలా జరగడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది.
మెక్సికో నగరం చుట్టూ పర్వతాలు, అగ్ని పర్వతాలు ఉంటాయి.
ఒకప్పుడు వీటి మధ్యలో భారీ సరస్సు ఉండేది.
ఆ సరస్సును పూడ్చి దానిపైనే మెక్సికో సిటీ నిర్మించారు.
నగరం కింద ఉండే నేలంతా చిత్తడి మెత్తటి నేల.
తరచూ భూగర్భ జలాలు తోడి వాడడం వలన నగరం భూమిలోకి కుంగిపోతోంది.
ప్రతి ఏటా మెక్సికో సిటీ 50 సెంటీమీటర్ల మేర కుంగిపోతునట్టు పరిశోధనలు చెబుతున్నాయి.