బరువు తగ్గడానికి మేయర్ పద్ధతి.. ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలో తెలుసా..?
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతీ ఒక్కరూ అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.
దీంతో బరువు తగ్గేందుకు అనేక చిట్కాలు, డైట్‌లు ఫాలో అవుతారు. అయితే.. మేయర్ పద్ధతి ద్వారా అధిక బరువు తగ్గేందుకు సులభం అవుతుందట.
బరువు తగ్గడానికి మేయర్ మెథడ్ అనేది ఒక ప్రముఖ డైట్ ప్లాన్.
ఇందులో ఆహారాన్ని ఎన్నిసార్లు నమలాలి అనేదానితో పాటు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ కలిగి ఉండటంపై అవగాహన కల్పించటం ప్రధాన ఉద్దేశం.
మేయర్ పద్ధతి ప్రకారం ఆహారాన్ని మింగడానికి ముందు కనీసం 25 నుంచి 30 సార్లు నమలాలి. దీంతో ఆహారాన్ని చిన్న కణాలుగా విడగొట్టి, లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీంతో ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
అదేవిధంగా తినడానికి సమయం కేటాయించాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినడం, ఆస్వాదించటం అన్నది శరీరం యొక్క ఆకలి సంకేతాలను సరిచేసేందుకు సహాయపడుతుంది.
ఇలా చేయడం ద్వారా కడుపు నిండుగా ఉన్నదాన్ని గుర్తించి అతిగా తినకుండా చేయటమే కాకా.. నెమ్మదిగా తినడం వల్ల కడుపు ఉబ్బరాన్ని కూడా నివారిస్తుంది.
ఆహారాన్ని ఎక్కువగా నమిలి తినడం ద్వారా సులభంగా విచ్ఛినం చేయడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహార పదార్ధం గట్టిగా ఉంటే మింగటానికి ముందు ఎక్కువ నమిలి మింగినట్లయితే జీర్ణం అవ్వడానికి సులభం అవుతుంది.