సాధారణంగా మనం తెలియని ఫ్యాక్ట్స్ చాలానే ఉంటాయి. అయితే మానవ శరీరానికి సంబంధించినవి కొన్ని నమ్మలేని నిజాలు ఇక్కడ చూద్దాం.

మానవుడు రోజుకి 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతారు.
మన తలపై ఉన్న ఒక్కో వెంట్రుక 3 నుంచి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.
ఒక మనిషి లేవకుండా 11 రోజుల వరకు నిద్రపోవచ్చు. అయినా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట.
మన శరీరం నుండి తల వేరు చేసినా.. అది 15 సెకన్ల పాటు స్పృహలోనే ఉంటుంది.
పడుకునే గది ఎంత చల్లగా ఉంటే అంత ఎక్కువగా పీడ కలలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మానవులకు ఉండే DNA అరటి పండులో ఉన్న DNA దాదాపు 50 శాతం ఒకేలా ఉండే అవకాశం ఉంది.
మనం తిన్నది ఆహారం అరగడానికి ఏ అవయవాలు సహాయ పడతాయో.. చనిపోయిన 3 రోజులకు అవే మనల్ని తినడం మొదలపెడతాయట.
వేలి ముద్రలు ఉన్నట్టు.. నాలుక ముద్రలు కూడా ఒకరితో మరొకరికి పోలిక లేకుండా ఉంటాయి.
ఒకవేళ మనిషి కన్నును తయారు చేయాలనుకుంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుంది..
మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
మీకు ఎంత ఎక్కువ IQ ఉంటే.. అన్ని కలలుగనే అవకాశాలు ఎక్కువ. అలాగే మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.
చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. దాని హెయిర్స్‌తో పోలీస్తే మానవులవి చాలా సన్నగా ఉంటాయి.
మన చర్మం నిమిషానికి 50000 సెల్స్‌ని విడుదలచేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే జీవిత కాలంలో అది 18 కిలోల సెల్స్ అన్నమాట.
మీకు 40 ఏళ్లు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు. ఒక సంవత్సరంలో 15000 కలలు కంటారట.