మామిడి పండ్లు సహజంగా పండినవా.. లేక కెమికల్స్‌తో పండించినవా? ఇలా గుర్తించండి!

సహజంగా పండిన మామిడి పండ్ల కంటే కృత్రిమంగా పండిన పండ్లే ఆకర్షణీయంగా ఉంటాయి.
రసాయనాలతో పండించిన పండ్లపై అక్కడక్కడ మచ్చలు కనిపిస్తాయి.
అలాగే మామిడి పండ్ల సైజ్ చిన్నగా ఉంటుంది.
వీటిని తినడానికి కట్ చేసినప్పుడు ఎరుపు లేదా పసుపు కలిగిన ప్రకాశవంతమైన కలర్‌లో ఈ పండు గుజ్జు కనిపిస్తుంది.
కెమికల్స్‌తో పండినవి తీపి తక్కువగా ఉంటుంది. తెలుపు, నీలం రంగు ఉన్న పండ్లను అస్సలు కొనవద్దు.
మామిడి పండ్లు కొనడానికి ముందు ఒక పండు తీసుకొని దాన్ని వాటర్ ఉన్న బకెట్‌లో వేయండి
మామిడి పండు మునిగితే సహజమైనదిగా, పైకి తేలితే రసాయనాలతో పండినట్లుగా గుర్తించండి.
కెమికల్స్‌తో కూడిన ఈ రకమైన మామిడి పండ్లను కొనకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.