మామిడి తొక్కల వల్ల అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం..!

ఎండాకాలం మామిడి పండ్లను ఎక్కువగా తింటారు. కానీ వాటి పొట్టును తీసేసి పడేస్తుంటారు.
అయితే పొట్టుతో చాలా రకాల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖంపై ముడతలతో బాధపడేవారు మామిడి తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఫేస్‌కి పెట్టుకుంటే అందం మరింత పెరుగుతుంది.
పండిన మామిడి తొక్కల పేస్ట్ ముఖానికి రాసుకోవాలి. అలా రోజూ చేయడం వల్ల మొటిమలు తొలగిపోయి మిల మిల మెరిసిపోతారు.
ఈ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపుతాయి. అందువల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది.
మామిడి పండుతో పాటు తొక్కలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బు నుంచి కాపాడుకోవచ్చు.