దోసకాయతో ఆరోగ్య దోషాలకు చెక్ పెట్టేద్దాం..

తీపి దోస విరేచన బద్ధతని కలిగిస్తుంది. పులుపుదోస విరేచనం అయ్యేలా చేస్తుంది.
తీపి దోస, పులుపు దోస రెండూ మూత్రంసాఫీగా అయ్యేలా చేస్తాయి.
రెండురకాల కాయలూ మొలలు వ్యాధిలో రక్తస్రావాన్ని , పైత్యాన్ని తగ్గించడంలో మేలు చేస్తాయి.
'పులుపు దోసకాయ చింతపండులాగా ఎక్కువ అపకారం చేసేది కాదు. జీర్ణశక్తిని దెబ్బతీయదు. అందుకని చింతపండుకు బదులుగా దోసకాయని వాడుకోవటం మంచిది.
దోసకాయను లిమిట్ లో తినాలి. అతిగా తింటే అజీర్తిని కలిగిస్తుంది. కడుపు మంట, కఫం పెరుగుతాయి. కడుపునొప్పి వస్తుంది.
తెలుగు ప్రజలకు 'దోస ఆవకాయ' ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. అలా అని అందరూ ఒకేలా తినేయొద్దు. వేడిచేసే శరీర స్వభావం వున్న వాళ్లు లైట్ ఫుడ్ గా తీసుకోవాలి
గోధుమపిండితో కలిపి వండుకుంటే దోస కాయల వలన కలిగే దోషాలకు విరుగుడుగా వుంటుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి.