ఈ పనులను చేసి భూమిని కాపాడుకుందాం!

ప్రతి యేటా ఏప్రిల్ 22 న మనం ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి అలాంటి భూమిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
వ్యర్థాలను తగ్గించడానికి.. వనరుల్ని కాపాడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఇది ఒకటి.. వీలైనంత ఎక్కువగా రీసైకిల్ చెయ్యాలి. దీని వల్ల వ్యర్థాలు పెరగవు.
అవసరం లేని సమయంలో లైట్లు, ఎలక్ట్రానిక్స్‌ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి.
ప్రయాణం చేసేటప్పుడు.. బస్సులు, మెట్రో రైళ్లలో వెళ్లడం మేలు. దీని వల్ల పొల్యూషన్ తగ్గుతుంది.
జులై నెలలో మొక్కలు నాటితే.. ఆ తర్వాత వానలు మొక్కలు.. పెరుగుతాయి. కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చి.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
నీటి వాడకం బాగా తగ్గించుకోవాలి. నీటిని ఆదా చేసేందుకు వీలైన అన్ని పనులూ చేయాలి.