హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహ బంధం ఎంతో పవిత్రమైనదని పెద్దలు చెబుతుంటారు.

అలాగే ప్రేమ బంధం, వివాహా బంధంలో ముఖ్యంగా ప్రేమ, విశ్వాసం, నమ్మంకం ఉంటేనే బంధం బలపడుతుందని నమ్ముతారు.
అయితే భాగస్వామి తమ విషయంలో ఎంత ప్రేమను చూపిస్తున్నారో తెలుసుకోవాలనుకునే వారు ఈ టిప్స్‌తో తెలుసుకొండి.
మీ భాగస్వామి మీరు చెప్పే విషయాలు, సమస్యలు ఓపికగా వింటే మీపై వారికి చెప్పలేనంత ప్రేమ ఉన్నట్టు.
అలాగే మీరు ఎంత పెద్ద తప్పు చేసినా వారు మీపై కోపాన్ని ప్రదర్శించకపోతే మిమ్మల్ని అర్థం చేసుకుని చాలా లవ్ చేస్తున్నారని అర్ధం
మీ కోసం వారు కొన్ని అలవాట్లను మార్చుకుంటే మీపై ప్రేమతోనే అలా చేసినట్లు అర్థం.
మీ భాగస్వామి మీపై ప్రేమను ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ సంతోష పెడుతున్నారంటే మీపై వారికి అమితమైన ప్రేమ ఉన్నట్లు.
మిమ్మల్ని అడగకుండానే మీకోసం అన్ని చేస్తున్నారంటే వారికి మీపై ప్రేమ ఉన్నట్టేనట.