గృహిణీలకు చిట్కాలు.. వంటగదిలో ఇలా చేస్తే మీరు క్వీన్‌నే..!
రోజుకో కొత్త రకం వంటలు చేయాలని గృహిణీలు వంట గదిలో కుస్తీలు పడుతుంటారు. కానీ, పిండి, కూరగాయలు తరుచూ పాడవడం జరుగుతుంటుంది. అలాంటి వాటికి చక్కటి చిట్కాలు ఇక్కడ చూద్దాం..
కట్ చేసిన కూరగాయ ముక్కలను పసుపు కలిపిన నీటిలో వేస్తే అందులోని క్రిములు పైకి తేలుతాయి.
ఇడ్లీ, దోశ చేసేటప్పుడు అందులో వినియోగించే బియ్యాన్ని కొద్దిగా వేయించి, నానబెట్టి చేస్తే రుచిగా ఉంటాయి.
బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజ్‌ను మైక్రో ఓవెన్లో ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుంది.
మినప రుబ్బులో నిమ్మరసం కలిపి చేస్తే మినప వడియాలు తెల్లగా వస్తాయి.
వేపుడు కూరల్లో ఓ చెంచా వెనిగర్ వేస్తే నూనె ఎక్కువగా పీల్చవు.