గృహిణులకు శుభవార్త.. ఈ సింపుల్ చిట్కాలతో మీ వంట గదిని శుభ్రంగా ఉంచుకోవచ్చు..!!

మనం తయారు చేసిన ఆహారం శుభ్రంగా, రుచిగా ఉండాలంటే వంటగది కూడా శుభ్రంగా ఉండాలి. లేదంటే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అయితే అలా ఉండటం వల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. బొద్దింకలు, బల్లులు, పిల్లులు వస్తాయి. కాబట్టి వంటగది శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాలి.
కిచెన్‌లో డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకుని దానికి కవర్‌ను కూడా ఉపయోగించాలి. అంతేకాకుండా మూత ఉన్న డస్ట్‌మిన్ అయితే బెటర్.
గిన్నెలు, చేతులు శుభ్రం చేసుకుని వాష్ బేసిన్‌ను అలాగే వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
వంట త్వరగా పూర్తి చేయాలన్న తొందరలో పొయ్యి‌పై సాంబార్ మరకలు పడటం గమనించరు. వంట కాగానే గ్యాస్ స్టవ్‌ను వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
వంట గదిలో ఉండే ఖాళీ స్థలంలో కొంత మంది చపాతీలు కూరగాయలను కటింగ్ చేస్తుంటారు. అలా చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయడం మంచిది.
అలాగే ఎక్కువ కాలంపాటు కూరగాయలు, పండ్లు తినబండారాలు నిల్వ ఉండాలని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అలా అయితే ఆహార పదార్థాల చుట్టూ పురుగుల పిచికారీ చేయాలి.
వైరస్, బ్యాక్టీరియా మీ ఫ్రిజ్, మైక్రోవేవ్, ఓవెన్ లోపలి భాగంలో కూడా పెరుగుతాయి. కాబట్టి వారానికి ఒకసారి మీ మైక్రోవేవ్ వంటి వాటిని శుభ్రం చేయండి.