బాలయ్య నెక్ట్స్ సినిమాలో ఆ హీరోయిన్‌కు తల్లిగా కాజల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటించి.. వరుస చిత్రాలతో దూసుకుపోయింది.
అయితే 2020 అక్టోబర్ 30వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ను‌ పెళ్లాడింది.
ఆ తర్వాత కాజల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంది.
2022లో ఏప్రిల్ 19న ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి బిడ్డను చూసుకుంటూ హాయిగా గడిపింది.
తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపుడి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న NBK 108వ చిత్రంలో కాజల్ ఎంట్రీ ఇవ్వనుందట.
ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా ఆమెకు తల్లిగా కాజల్ అగర్వాల్ నటిస్తునట్టు సమాచారం.
ఈ విషయంపై చిత్రబృందం కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
బాలయ్య NBK108వ చిత్రానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.