‘ఆదిపురుష్‌’ లో రాముడిగా కనిపించేందుకు ప్రభాస్ అంతలా కష్టపడ్డాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ డార్లింగ్‌కు జంటగా నటించింది. అయితే ఈ సినిమా జూన్ 16న విడుదలై మిక్స్‌డు టాక్‌ను సొంతం చేసుకుని పలు వివాదాలను ఎదుర్కొంటుంది. అయినా భారీ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
రాముడు అంటే రాజ్యానికి రాజు అలాగే విలువిద్యలో నేర్పరి కూడా. అయితే ప్రభాస్ రాముడుగా మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది.
రాముడి లాగా తన బాడీని మార్చుకుని ఆదిపురుష్‌లో కనిపించాడు. దాని కోసం తన శరీరాన్ని వీ ఆకారంలో మార్చుకుని భూజాలు, వెడల్పుగా నడుము సన్నగా తీర్చిదిద్దుకున్నాడు.
అంతేకాకుండా తన మజిల్స్ పెంచుకునేందుకు కష్టతరమైన బరువులు ఎత్తడం అలవాటు చేసుకున్నాడట.
వాటితో పాటు కార్డియో, వెయిట్ ట్రైనింగ్‌కు సంబంధించిన వ్యాయామాలు ప్రతి రోజు చేసేవాడట. ముఖ్యంగా చెస్ట్ పెంచే ఎక్సైజ్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టి విలుకారుడిగా మారిపోయాడు.
ఆదిపురుష్ సినిమా కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రభాస్ కష్టపడి బాడీని రాముడిలా తీర్చిదిద్దుకున్నా కానీ, ఈ సినిమాకు వివాదాలు తప్పడం లేదని కొంత మంది నెటిజన్లు అనుకుంటున్నారు.