మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తికి పెళ్లైందా..!! తెలుసుకోవడం ఎలా..?
ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియా యాప్స్ ద్వారా పరిచయమైన వ్యక్తితో డేటింగ్‌కు రెడీ అయిపోతారు.
అలా పరిచయమైన వాళ్లో కొంత మంది నిజంగా నిజాయితీగా ప్రేమించే వాళ్లు ఉంటారు. మరికొందరు పెళ్లిళ్లు అయిన కాలేదని అబద్దాలు చెప్పి దగ్గరయ్యేందుకు చూస్తారు.
అలా పరిచయమైన లేదా మీరు ప్రేమించిన వ్యక్తులకు పెళ్లి అయిందో లేదో ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.
పెళ్లైన వ్యక్తులు మీతో ఫుల్ టైమ్ స్పెండ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ల పట్నార్‌కు కూడా సమయం కేటాయించాలి కాబట్టి.
మీరు ప్రేమించిన వ్యక్తి వాళ్ల ఇంటికి ఆహ్వానించక పోయిన, ఫ్రెండ్స్‌ను పరిచయం చేయకపోయిన అనుమానించాల్సిందే. ఎందుకంటే వాళ్ల సన్నిహితులతో మీకు పరిచయమైతే వారి గుట్టు బయటపడుతుందని భయం.
మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్న కొంత మంది వ్యక్తులు ముఖ్యంగా రాత్రి సమయంలో ఫోన్లు మాట్లాడరు కానీ మెసేజ్‌లు చేసేందుకు ఇన్‌ట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి సమయంలో కూడా మీరు అనుమానించాల్సిందే.
మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తికి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్లయితే.. రాత్రి సమయంలో మీతో ఉండమని కోరిన వారు ఉండరు. ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు.
అంతే కాకుండా.. మీతో సెల్ఫీలు తీసుకోవడానికి ఇబ్బంది పడిన.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఇష్టం లేదని చెప్పిన.. మీతో బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్‌లో ఎవరైనా చూస్తారని భయపడిన మీరు అనుమానించాల్సిందే.
ముఖ్యంగా.. మీరు ప్రేమించిన వ్యక్తి మీతో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ వస్తే వింతగా ప్రవర్తిస్తారు. మీ ముందు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. అలాంటి వ్యక్తులు మీ నుంచి ఏదో దాస్తున్నారని అర్థం.
ఫైనల్‌గా మిమ్మల్నీ నిజంగా ఇష్టపడే వ్యక్తులు వారి ఫ్యూచర్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటారు. ఆ ప్రస్తావన కూడా తీసుకురారు. ఈ విధంగా వ్యవహరిస్తు్న్న వ్యక్తులు ఫేక్ రిలేషన్‌లో ఉన్నారని అర్థం చేసుకోవాలి.