వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది చల్లటి నీటిలో ఉండి ఎక్కువ సేపు స్విమ్మింగ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

అయితే వేసవిలో అధికంగా స్విమ్మింగ్ చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పల్లెల్లో ఉండే వారు బావుల్లో నిలువ ఉన్న నీటిలో ఈత కొడితే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయి.
రోజుల తరబడి నిలువ ఉన్న నీటిలో ఎక్కువ సేపు ఈత కొట్టడం వల్ల దురద, దద్దుర్లు, కళ్లలో మంటలు, కళ్లు తిరగడం వంటివి వచ్చే అవకాశం ఎక్కువ.
పట్టణాల్లో స్విమ్మింగ్ ఫూల్స్‌కు ఎక్కువ. సమ్మర్ హాలీడేస్‌లో కొంత మంది తల్లిదండ్రులు ఎక్కువగా చిన్నారులకు ఈత నేర్పిస్తారు.
స్విమ్మింగ్ సెంటర్‌లో అందరూ కలిసి ఈత కొట్టడం వల్ల ఒకరి రోగాలు ఒకరికి అంటుకునే ప్రమాదం ఉంటుందట.
కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఈత కొట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
జనసాంద్రత తక్కువగా ఉన్న స్విమ్మింగ్ ఫూల్స్‌లో మాత్రమే ఈత కొట్టాలట.
స్విమ్ చేసేవారు పలు జాగ్రత్తలు వహించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.