రాత్రి సమయంలో పెరుగు తింటే ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.
అంతేకాదు పెరుగులో చక్కెర వేసుకుని తింటే.. తక్షణ శక్తితో పాటు శరీరంలో వేడి కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే.. పెరుగును రాత్రి సమయాల్లో తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం..
పెరుగు ఘన పదార్థం. అది అరగటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే రాత్రి సమయాల్లో పెరుగన్నం తినకూడదని పెద్దలు చెబుతున్నారు.
రాత్రి సమయాల్లో పెరుగు తీసుకుంటే శరీరంలో డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయాల్లో పెరుగు తినడం వల్ల కఫం పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
అయితే.. పెరుగు కాకుండా రాత్రి సమయాల్లో మజ్జిగా తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.