మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

మాంసం ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. కనీసం వారానికి మూడు నాలుగు సార్లు అయినా చికెన్, లేదా మటన్ తెచ్చుకొని తింటుంటారు.
అయితే చాలా మంది మటన్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు, కానీ, చికెన్ కన్నా మటన్ తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే అధిక ప్రొటీన్‌లు శరీర కండరాలను బలపరుస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాల సమస్యలు రాకుండా ఉంటాయి.
గర్భిణీలు తమ డైట్‌లో మటన్ చేర్చుకోవడం వల్ల పుట్టే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు.
మటన్ తినడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనిలో అధిక పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు, స్ట్రోక్ వంటివి రాకుండా చేస్తుంది.
బీకాంప్లెక్స్‌, సెలినియం, కొలైన్‌ వంటివి క్యాన్సర్‌ బారిన పడకుండా దోహదపడతాయి.
మటన్‌లో విటమిన్లు, కొలెస్ట్రాల్‌, అమినోయాసిడ్స్‌, మాంగనీస్, కాల్షియం, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, సెలేనియం ,పొటాషియం, సోడియం, ఒమేగా3 ఉండి శరీరానికి బలాన్ని అందిస్తాయి.