చలికాలంలో చింత చిగురు తింటే ఆరోగ్యానికీ మంచిదేనా? తాజా వెల్లడి!

చింత చెట్లు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎండాకాలంలో చల్లదనం కోసం చాలా మంది ఈ చెట్టుకింద కూర్చుంటారు.
అయితే ఈ చెట్టుకు చిగురించే ఆకు తీసుకుంటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చింత ఆకుల మిశ్రమం షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.
అలాగే చింత ఆకులు కామెర్లు తొందరగా నయం చేస్తుంది.
ఈ ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది.
బాలింతలు ఈ చింత ఆకుల రసం తాగితే తల్లి పాల నాణ్యత ఇంకా మెరుగుపడుతుంది.
అలాగే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
చింతాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. కాబట్టి ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
కిడ్నీల్లో స్టోన్స్ రాకుండా నిరోధించడంలో చింత చిగురు మేలు చేస్తుంది.