మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరిగి పిల్లలు కలగాలంటే ఈ పండు తినాల్సిందే..!
ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పిల్లల కోసం అనేక మందులు మింగుతున్నారు. కానీ, సంతానం మాత్రం కలగదు.
దీనికి ప్రధాన కారణం మహిళలే అని చాలా మంది అపోహ పడుతుంటారు. నిజానికి సంతానలేమి సమస్యలకు మగావారు కూడా కారణం అవుతారు.
చాలా మంది మగవారిలో పిల్లలు పుట్టేందుకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం.. ఉన్న స్పెర్మ్ కూడా నాణ్యత లోపించడం వంటి కారణంగా కూడా సంతాన లేమి కలుగుతోంది.
నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు, ఉష్ణోగ్రతలు వంటి కారణాల వల్ల పురుషులలో స్పెర్మ్ సమస్యలు ఎదురవుతుంటాయి. మగవారు తండ్రి కావాలనుకుంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, మెర్బాలిటీని మెరుగుపరచడానికి కివీ పండు ప్రధానంగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
కివిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది పురుషులకు మాత్రమే కాదు, గర్భం దాల్చాలనుకునే మహిళలకు సంతానోత్పత్తి బూస్టర్‌గా పని చేస్తుంది.
కివిలో మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మగవారిలో స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
కివిలో మెండుగా ఉండే ఫోలేట్, విటమిన్లు, జింక్, కాల్షియం, ఇతర ఖనిజాలు స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీని అనేక రెట్లు పెంచుతాయి. కివిలో జింక్ ఎక్కువడగా ఉంటుంది. ఇది స్పెర్మ్ ఆరోగ్యానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది.
కివీ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్‌ను తగ్గిస్తుంది. ప్రొటీన్ సమతుల్యతను అందిస్తుంది. NCBI పరిశోధన ప్రకారం, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ క్వాలిటీ, కదలికను మెరుగుపరుస్తాయి.
పురుషులలో మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పురుషుల కివీ పండు తరచుగా తినడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయి మెరుగుపడుతుంది. దీని ద్వారా మగవారిలో సంతాన లేమి సమస్యలు దూరం అవుతాయి.