వేడిని తట్టుకోలేక ఎక్కువ సేపు ఏసీలో ఉంటున్నారా?

వేసవి కావడంతో భానుడి భగ భగలతో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటకు పోవాలంటేనే జంకుతున్నారు.
వేడిని తట్టుకునేందుకు ఎక్కువసేపు ఏసీల్లో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మం పొడిబారడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎయిర్ కండిషన్డ్ భవనాల్లో ఉండే వారికి ముక్కు కారడం,శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
అలాగే ఎయిర్ కండీషనర్లను ఎక్కువగా వాడటం వల్ల మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం వేడిని తట్టుకునే శక్తి తగ్గి పోయి పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.
ఏసీలో ఉండేవారికి కళ్లలో దురద, నీరు కారడం, చికాకు, రావడంతో పాటు చూపు మసకబారుతుంది.
శరీరం వేడిని తట్టుకునేందుకు నిత్యం ఏసీలలో ఉండకుండా కొబ్బరిబొండం, శీతల పానియాలు సేవించాలి.
ఎక్కువగా ఏసీల్లో ఉండకుండా శరీరానికి కాస్త ఎండను కూడా తగలనిస్తే ఆరోగ్యంగా ఉంటారు.