మీరు వింటున్న మ్యూజిక్‌కు తగ్గట్టుగా మీ గుండె కొట్టుకుంటుంది.

ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా దాగి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
90 శాతంకి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే వస్తాయట.
రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్‌ను 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చట.
నిద్రించే సమయంలో మన వాసన పీల్చే భావం పనిచేయదు కాబట్టి వాసనను కనుగొనలేము.
గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారట.
7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారట. అంతేకాకుండా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మీకు 60 ఏళ్లు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి. కాబట్టి దేనినైనా రుచిని తొందరగా చెప్పలేము.
మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి అయ్యే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో ఓ బల్బ్‌ని వెలిగించవచ్చు.
మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.