ప్లాస్టిక్ బాక్స్‌లో ఫుడ్ పెడితే ఈ అవయవాలకు ముప్పు తప్పదు!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో ప్లాస్టిక్‌ను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.
ప్టాస్టిక్ పర్యావరణానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో హాని కలుగజేస్తుందన్న సంగతి చాలా మంది మర్చిపోతున్నారు.
పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ఉంటుంది. ఈ ఏడాది థీమ్ ‘ప్లాస్టిక్ పొల్యూషన్ సొల్యూషన్స్’.
ప్రస్తుతం ఇండ్లల్లో ప్లాస్టిక్ టిఫిన్ల వాడకం బాగా పెరిగింది. ఇది వ్యాధులను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచడం వల్ల హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోతాయి. దీంతో క్యాన్సర్, హార్మోన్ల సమస్యలకు దారితీస్తుంది.
ఇది మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది.
అందుకే ప్లాస్టిక్ టిఫిన్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్లను వాడండి.
ఇంట్లో కూరగాయలను కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బౌల్స్ లాంటివి కూడా దూరం పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.