తులసి చెట్టుకు పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందని తెలుగువారు ఎక్కువగా నమ్ముతుంటారు.

అలాగే తులసి ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పాలలో వేసుకొని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ జీవితంలో డిప్రెషన్‌కు గురికావడం సర్వసాధారణం. అలాంటి వారు పాలల్లో తులసి ఆకులను మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అస్తమా రోగులు తులసి ఆకుల పాలను తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
మైగ్రేన్ తల నొప్పితో బాధపడేవారు తులసి ఆకుల పాలను ప్రతి రోజూ తాగడం మంచిది.
రకరకాల ఆహారాలు తీసుకోవడం వల్ల చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి కిడ్నీ స్టోన్ ఉంటే ఈ పాలను తాగడం వలన ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.