ఈ పండ్లును తొక్క తీసి తింటున్నారా..? అయితే పోషకాలు పోయినట్లే..

మన శరీరానికి పోషకాలు చాలా అవసరం.
శరీరానికి అవసరమైన పోషకాలు పండ్లు, కూరగాయలు, ఆహారం రూపంలో తీసుకుంటారు.
సీజనల్ ఫూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని తినే విధానంలో కూడా కొన్ని పోషకాలు పోతాయి
అయితే పండ్లు తినే టప్పుడు.. కొన్ని వాటికి తొక్క తీసి తింటారు.
కానీ, డాక్టర్ల సూచన మేరకు పండ్లలో పోషకాలు చాలా వరకు తొక్కల్లోనే ఉంటాయి. వాటిని తీసేసి తింటే పోషకాలు పోయినట్లే అంటా.. మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం...
ఆపిల్: చాలా మంది ఆపిల్ తొక్క తీసి తింటారు. కానీ, తొక్కలో 332 శాతం ఎక్కువ విటమిన్-కె, 142 శాతం విటమిన్-ఎ, 115 శాతం విటమిన్-సి, 20 శాతం కాల్షియం, 19 శాతం పొటాషియం ఉంటుందని డాక్టర్లు తెలుపుతున్నారు.
కీరా దోసకాయ: కీర దోస తొక్క తీసి తినే అలవాటు ఉంటే ఆపేయండి. ఎందుకంటే, ముదురు ఆకుపచ్చ కీరా దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం దాంతో పాటు విటమిన్-కె అధికంగా ఉంటుందంటా.
మామిడి: ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు, రొమ్ము, మెదడు, వెన్నుపాము, క్యాన్సర్ అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడే మాంగిఫెరిన్, నోరెథిరోల్, రెస్వెరాట్రాల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పచ్చి, పండు మామిడి తొక్కలో ఉంటాయని.. అందుకే తొక్కతో తినడం ఎంతో ప్రయోజనకరం డాక్టర్లు సూచిస్తున్నారు.