పెరిగిన ధరలకు టమాట ఒరుగులతో చెక్.. ఎలా రెడీ చేసుకోవాలో తెలుసా?

వర్షాల వల్ల పంటలు చేతికి రావడం లేదు. దీంతో టమాట ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక్కో ప్రదేశంలో ఒక్కో రేటు పలుకుతూ అందరికీ షాకిస్తున్నాయి.
దీంతో టమాటాలను కొనాలన్నా, తినాలన్నా సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఏ కూరల్లో టమాటాలు వాడకుండానే వంట చేసేస్తున్నారు. అలాంటి వారు టమాట ఒరుగులు తయారు చేసుకోవడం ఉత్తమం.
ముందుగా తాజాగా ఉన్న టమాటాలు కిలో తీసుకుని వాటిని ఉప్పు నీటిలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత ఏదో ఒక సైజ్‌లో ఈజీగా ఎండిపోయేలా కట్ చేసుకుని ఆ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకుని వాటిని ఎండలో పెట్టుకోవాలి.
అవి తడి లేకుండా ఎండిన తర్వాత ఏదైనా కంటైనర్‌లో పెట్టుకుని నిల్వ ఉంచుకోవాలి.
ఈ ఒరుగులను ఏ కూరల్లో అయినా వేసుకోవచ్చు. ఒకవేళ అవి త్వరగా ఉడకాలంటే వాటిని నీటిలో కాసేపు నానబెట్టుకుని వండుకోవాలి.
ఇవి జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఎంతో తాజాగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి.