ఈ ఐదు పొరపాట్లు చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలవడం కష్టం..
డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎంత సంపాదించిన ఆ డబ్బును కూడ పెట్టుకోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.
అయితే మీరు చేసే పొరపాట్లే డబ్బు మీ దగ్గర ఉండకపోవడానికి ప్రధాన కారణాలు. అవేంటో తెలుసుకుందాం.
చాలా మంది ఏ వస్తువైనా చూడగానే దాన్ని కొనేయాలని అనుకుంటారు. కానీ, అది అవసరమ లేదా అనేది ఆలోచించరు. అవసరం అయితే కొనొచ్చు. కోరిక అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ముందు బడ్జెట్ వేసుకుని దానికి అనుగుణంగా ఖర్చులు చేస్తే.. డబ్బు సేవ్ అవుతుంది.
కొందరు సంపాదించేది రూపాయి అయితే ఖర్చు రెండు రుపాయిలు ఉంటుంది. అలాంటి వారు సంపాదించిన దాంట్లో ముందుగానే కొంత డబ్బు దాచుకుంటే మంచిది. ఇలా దాచుకుని అవసరానికి మాత్రమే ఖర్చు పెడితే మంచిది.
సంపాదన ఆలోచనతో కొందరు సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిలో పెట్టేస్తుంటారు. అది మంచి పద్దతే అయినప్పటికీ.. ఎందులో పెట్టాం, ఎంత పెట్టాం, ఎప్పుడు పెట్టాం అనే విషయాలు మర్చిపోయి లాస్‌లో పడతారు. కాబట్టి ప్రతీ దానికి ఓ రికార్డులు మెయింటైన్ చేయడం మంచిది.
ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి. సంపాదించిన ప్రతీ రూపాయిలో కాస్త ముందుగా పక్కన పెట్టుకుంటే.. అవసరాలకు డబ్బు కోసం బాధపడే సమస్య ఉండదు. ఈ రకంగా కూడా డబ్బు సమస్య దూరంగా ఉంటుంది.
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. దీంతో ఎంత ఖర్చుపెడుతున్నాం అనే లెక్క లేకుండా ఖర్చుపెట్టేస్తారు. కాబట్టి.. షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు కార్డులు కాకుండా ఏం కొనాలి అనుకుంటున్నామో దానికి సరిపడా డబ్బు తీసి పెట్టుకుంటే మంచిది. అధిక ఖర్చు తగ్గుతోంది.