పచ్చి మామిడి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు..!

వేసవిలో మామిడి పండ్లు, పచ్చి కాయలు విరివిగా దొరుకుతాయి. వాటిని ముక్కలుగా చేసి ఉప్పు, కారం వేసుకుని చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటుంటారు.
పండ్లను తినడం వల్ల కంటే పచ్చి మామిడి కాయలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పచ్చి మామిడిలో విటమిన్లు, కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండి తెల్ల రక్త కణాలను పెంచుతాయి.
ఇందులో పాలీఫెనాల్స్, యాంటీ కాన్సినో జెనిక్ ఉండటం వల్ల ప్రమాదకర క్యాన్సర్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
పచ్చి మామిడిలో ఫైబర్ ఉన్నందున కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలిగి ఎక్కువగా ఆకలి అనిపించదు. కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చిమామిడిని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గి మంచి ఫలితాన్ని కలిగిస్తాయి.
పచ్చి మామిడిలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కళ్ల సమస్యలను దరి చేరకుండా చేస్తుంది.
మామిడిలో ఉండే మాంగీఫెరిన్ యాక్సిడెంట్ ఒత్తిడిని తగ్గించి గుండెకు సంబంధించినవి రాకుండా ఉంటాయి.
రోజు రోజుకు సూర్యుడి భగభగలు పెరిగి ఎండ తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఎండలకు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పచ్చిమామిడి తినాలి.
అలాగే పచ్చిమామిడి రక్తనాళాలను శుభ్రపరిచి రక్తపోటును అడ్డుకుంటాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.