ఈ ఐదు పద్ధతులు అనుసరిస్తే.. జిమ్‌కు వెళ్లకుండానే అధిక బరువు తగ్గుతారు..!

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు.
బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వండుకోకుండా ఇన్‌స్టెంట్‌గా దొరికే ఫుడ్‌కు చాలా మంది అలవాటు పడ్డారు. అధిక బరువుకు ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
మరి జిమ్‌కు వెళ్లకుండానే అధిక బరువు నుంచి ఉపసమనం పొందాలంటే ఈ ఐదు పద్దతులు అనుసరిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
ప్రతిరోజు ఒక 20 నిమిషాలు నడవాలట. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీస దూరమైన నడిస్తే.. కడుపులో ఆహారం జీర్ణం అయ్యి అధిక బరువు సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
మనిషి ఆరోగ్యానికి ఆహారంతో పాటు.. సరైన నిద్ర ఎంతో అవసరం. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర స్థూలకాయాన్ని దూరం చేస్తుందట. మంచి నిద్ర శరీరంలోని కండరాలకు పూర్తి విశ్రాంతి లభించడంతో పాటు.. ఆహారం కూడా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
చాలా మంది వాటర్ ఎక్కువగా తాగరు. అయితే.. రోజు గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భోజనానికి అరగంట ముందు, తర్వాత గోరు వెచ్చటి నీళ్లు తాగితే అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతోంది.
ఊబకాయంతో పాటు, చక్కెర అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. మీరు క్రమంగా చక్కెరను పూర్తిగా తగ్గించడం వల్ల.. శరీరంలో కొవ్వు తగ్గి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే.. శరీరంలో బలం కావాలంటే ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం మాపిల్స్, ధాన్యాలు, జామపండ్లు, అరటిపండు వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉండటంతో పాటు.. శక్తి కూడా లభిస్తుంది.
నోట్: పైన తెలిపిన సమాచారం.. ఇంటర్నెట్, నిపుణులు ఆధారంగా ఇచ్చినవి మాత్రమే. ఆరోగ్యం పరంగా ఎలాంటి సలహా కావాలన్న వైద్యులను సంప్రదించడం మంచిది.