బొప్పాయి తిన్నాకా ఇవి తింటే.. అనారోగ్యం కోరి తెచ్చుకున్నట్లే..!

బొప్పాయిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉండటంతో.. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకురుస్తాయి.
బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్, ఫైబర్ యొక్క అధిక కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడతాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, బ్లాటింగ్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లక్షణాలు మెరుగుపడతాయి.
అంతే కాకుండా బొప్పాయి గింజలు, వేర్లు, ఆకులు కడుపు పూతలకి మేలు చేస్తాయి.
అయితే ఇన్ని మంచి లక్షణాలు బొప్పాయి కూడా ప్రమాదం. ఎందుకనుకుంటున్నారా..? బొప్పాయి తిన్నాక ఈ పదార్థాలు తింటే అనారోగ్యాని కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ఏం తినకూడదో తెలుసుకుందాం.
నారింజ-బొప్పాయి: నారింజ లేదా బొప్పాయి ఏదైనా ఒకటి తినాలి. బొప్పాయిలు నారింజను కలిపి తిన్న లేదా ఒకదాని తర్వాత మరొకటి తిన్న విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది.
పెరుగు-బొప్పాయి.. ఈ రెండిటి కలయిక ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు కలిపి తీసుకోవడం కారణంగా తలనొప్పి, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పాలు-బొప్పాయి: పాలు, బొప్పాయిలో పోషకాలు చాలా ఉంటాయి. వీటిని కలిపి తింటే మలబద్ధక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ రెండింటిని తినాలి అనుకుంటే గంటన్నర గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చట.
నిమ్మకాయ్-బొప్పాయి: ఈ రెండిటి కాంబినేషన్ అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. బొప్పాయి తిన్న వెంటనే నిమ్మకాయ తింటే నీరసం వస్తుందని తెలిపారు.