మెంతులను ఇలా తింటే టైప్ 2 డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు!

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్.
ఇది ఒక సాధారణ జీవక్రియ వ్యాధి. దీన్ని పూర్తిగా నయం చేయలేం. కేవలం నియంత్రించగలం.
కాగా మధుమేహులకు మెంతులు ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో మేలు చేస్తాయి.
అలాగే గ్లూకోమెన్ ఫైబర్‌తో పాటు మెంతుల్లో కరిగే ఫైబర్స్ అధికంగా ఉంటాయి.
ఇవి పేగుల్లో గ్రహించిన చక్కెర శోషణను ఆలస్యం చేస్తాయని ఆయుర్వేదంలో ఒక పరిశోధనా జర్నల్ అభిప్రాయపడింది.
అంతేకాదు ఫినుగ్రెసిస్, ట్రైగోనెల్లిన్ వంటి ఆల్కాలాయిడ్లు డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది.
షుగర్ లెవల్స్‌ను లేదా ఇన్సులిన్ నిరోధకతను కంట్రోల్ చేయడానికి మెంతులను నీటిలో నానబెట్టి తినాలంటున్నారు.
రోజుకు 10 గ్రాముల మెంతులను తీసుకోవడం వల్ల హెచ్ బి ఏ 1 సి తగ్గుతుందట.
వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఫుడ్ రుచి మరింత టేస్టీ‌గా ఉంటుంది.
అంతేకాదు మెంతి ఆకులను కూరగా చేసుకుని తినవచ్చు. ఈ ఆకులు కొద్దిగా చేదుగా ఉన్న ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది.
వివిధ రకాల విటమిన్లు కలిగిన ఈ మెంతులు తింటే డయాబెటీస్‌ను నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.