వర్షాకాలం అలర్జీలు రాకూడదంటే.. వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే?

ప్రస్తుతం రుతుపవనాలు మొదలవ్వడంతో తొలకరి చినుకులు పడుతున్నాయి. ముందు ముందు వర్షాకాలం కాబట్టి వానలో తడిస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆస్తమా, సైనస్‌ సమస్యలు ఉన్నవారి పరిస్థితి తీవ్రం అవుతుంది. వర్షాకాలంలో అలెర్జీలు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఇబ్బంది పెట్టుకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
వంటింట్లో ఉండే అల్లంలో యాంటీఇన్ఫమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున అల్లం టీ తాగితే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.
అలాగే సీ విటమిన్ ఉన్న సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటాయి. కాబట్టి మీ డైట్‌లో నిమ్మ ఆరెంజ్, బత్తాయి, యాపిల్ వంటివి చేర్చుకోవాలి.
పసుపులో వివిధ ఔషద గుణాలు ఉండి దగ్గు, జలుబు, గొంతునొప్పి తదితర సమస్యలతో పోరాడుతుంది. పసుపును పాలల్లో వేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.
ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే బయోఫ్లేవనాయిడ్,ప్రీబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి జీర్ణాశయానికి మేలు చేయడంతో పాటు పలు సమస్యలకు చెక్ పెడతాయి.
అలాగే అన్ని కూరల్లో ఉపయోగించే టమాటాలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.