వంటకాల్లో విరివిగా వాడే టమాటాలతో ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

వేసవిలో ఎండలకు చర్మం పాడైపోతుంది. అలాంటి వారు టమాటాలతో ఇలా చేస్తే అందాన్ని రెట్టింపు చేసుకుని మిల మిల మెరిసిపోతారు.
టమాటాల రసంలో కొద్దిగా బియ్యంపిండి వేసి ముఖానికి అప్లై చేయాలి. ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత కడిగితే ముఖంపై మచ్చలు పోయి కాంతివంతంగా మారుతుంది.
ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉంటే.. టమాట రసంలో గంధం పొడి, నిమ్మరసం వేసి 15 నిమిషాలు ఫేస్‌కు అప్లై చేసుకుని కడిగేసుకుంటే చర్మం తెల్లగా మారి యవ్వనంగా కనిపిస్తుంది.
అలాగే మొటిమలు ఉన్నవారు టమాటా ముక్కను తీసుకుని పంచ దారలో ముంచి ముఖంపై 5,10 నిమిషాలు రుద్దుకుని ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల మచ్చలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.
టమాటా పేస్ట్‌ను కలబంద జెల్‌తో కలపి ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి అందంగా మారుతారు.
ఈ పండు గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, పూదీనా వేసి కలిపి దానిని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.