చీకటి పడ్డాక ఈ పనులు చేస్తే దరిద్రం పట్టుకుని కష్టాల్లో పడటం ఖాయమట..!

చీకటి పడ్డాక కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ తప్పులు చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుందట.
అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మంచి జరగాలంటే రాత్రి సమయాల్లో ఈ పనులు అస్సలు చేయకూడదు.
ముఖ్యంగా మహిళలు జుట్టు వీరబోసుకుని పడుకుంటే అశుభానికి సంకేతం. కాబట్టి జడ వేసుకొని పడుకోవడం మంచిది.
అలాగే రాత్రి సమయాల్లో పంచదార, ఉప్పు,పాలు, పెరుగు, పసుపు వంటి వాటిని దానం చేయకూడదు. లేదంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాత్రి డిన్నర్ తర్వాత వంటసామాన్లను అపరిశుభ్రంగా పెట్టి నిద్రపోతే కుటుంబం అప్పుల పాలు అవుతారు.
సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించడం వంటివి చేయకూడదు. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు.
కొంత మంది రాత్రి లైట్లు వేసాక ఇళ్లు శుభ్రపరచడం వల్ల కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో బట్టలు ఉతికినా, ఆరబెట్టినా దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి పొద్దున, సమయంలో బట్టలు ఉతకాలి. లేదంటే పలు అనర్థాలు జరుగుతాయి.