తెలుగువారు సంప్రదాయం ప్రకారం ఉగాది రోజున కొత్త సంవత్సరం వచ్చినట్లు భావిస్తారు.

కాబట్టి ఉగాది రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ వస్తువులను తెచ్చుకోవడం మంచిది.
లాఫింగ్ బుద్ధని తెచ్చుకోవడం వల్ల ఇంట్లో అందరూ శాంతంగా ఉంటూనే ఎక్కువ డబ్బును సంపాదిస్తారట.
ముత్యాల శంఖం ఉగాది రోజున ఇంటికి తెచ్చుకుని పూజలు చేస్తే ధనలాభం కలుగుతుంది.
తులసి మొక్కను తీసుకురావడం వల్ల అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.
లోహపు తాబేలును తెచ్చుకుంటే దుష్ట శక్తులను నాశనం చేసి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.
నెమలి ఈకలు తీసుకురావడం వల్ల అన్ని శుభాలు వింటారట.