పడుకునేముందు ఇలా చేస్తే కలలో దేవుడు మనతో మాట్లాడతారట..!
సాధారణంగా ప్రతీ ఒక్కరికి కలలు అనేవి వస్తుంటాయి. ప్రకృతి దృశ్యాలు, జంతువులు, ప్రమాదకరమైన సంఘటనలు, వేడుకలు మొదలైనవి వస్తుంటాయి.
మంచి కలలు వచ్చినప్పుడు మెలుకువ తర్వాత ఆనందపడటం, అదే చెడు కల వస్తే భయపడటం లాంటివి జరుగుతంటాయి.
ఒక్కోసారి అదే పనిగా చెడు కలలు వస్తుంటాయి. అప్పుడు చెడు జరుగుతుందేమో అని భయపడుతుంటారు. దీంతో మానసిక ఆందోళన కలుగుతుంటుంది.
అయితే చెడు కలల నిత్యం వస్తున్నట్లయితే ఓ శ్లోకాన్ని చదవమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రామ స్కంధం హనుమంతం.. వైనతేయం వృకోదరం.. శయనేయః స్మరేన్నిత్యమ్.. దుస్వప్న స్గస్యనశ్యతిః. ఈ శ్లోకాన్ని చదువుకోవాలి.
ఈ శ్లోకం భావం: శ్రీరామ చంద్రుడు, కుమార స్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు ఈ ఐదు మందిని ఎవరైతే నిద్ర పోయో ముందు తలుచుకుంటారో పీడకలల కారణంగా కీడు జరగదని ఈ శ్లోకానికి భావం.
సాక్ష్యాత్తు ఆ హనుమంతుడే మన కలలో కనిపిస్తాడు. మనకు ధైర్యం చెబుతాడు. మన భయాన్ని పోగొడతాడు, మనతో మాట్లాడతాడు.
ముఖ్యంగా చిన్న పిల్లలు పడుకునే ముందు ఈ శ్లోకాన్ని చదివితే మంచిది. కాబట్టి మీ పిల్లలతో చదివించండి