ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టవంతులు అవడం ఖాయం..!
హిందువులు పువ్వులకు ఇంట్లో పెంచుకునే చెట్లకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు.
అయితే ఇంట్లో అపరాజిత పువ్వులను పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న చెడు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అపరాజిత పుష్పాలు విష్ణువుకు చాలా ఇష్టమైనవి. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం.
తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలు శివునికి సమర్పిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించాలన్నా అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడపడితే అక్కడ దానిని పెంచకూడదు.
అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు ఉత్తరం దిశలో పెడితే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.
ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఆదాయం పెరిగి అప్పులు తీరడంతో పాటు ధనవంతులు అవుతారట.
అపరాజిత పూలతో శని దేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో దుష్టశక్తులు పోయి మంచి శకునాలు ఎదురవుతాయి.