హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరంలో ముందుగా జరుపుకునే పండుగ ఉగాది.

ఈ ఏడాది మార్చి 22న ఉగాది పండుగ వస్తుంది కాబట్టి చాలా మంది ముందుగానే ఇళ్లు వాకిళ్లు శుభ్రపరుచుకోవడం ఆనవాయితీ.
అయితే ఉగాదికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుంచి తొలగించక పోతే ఇంట్లో ఇబ్బందులు పెరగడమే కాకుండా దరిద్రం వెంటాడుతుందట.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
అలాగే గాజు ముక్కలతో చేసిన వస్తువులు ఒకవేళ పగిలి పోతే వాటిని వెంటనే బయట పడేయాలి.
చిరిగిపోయిన మత పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు. వాటిని నీటిలో వదిలివేయడం కుటుంబానికి మంచిది.
కొంత మంది ముందుగానే కొన్ని మందులను తెచ్చిపెట్టుకుంటారు. అవి గడువు ముగిసిపోతాయి కాబట్టి వాటిని ఉగాదికి ముందే బయటపడేయడం మంచిదట. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.