జాగ్రత్త..! Exercise చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే మీకు గుండె సమస్యలు ఉన్నట్లే..!!

ఇటీవల కాలంలో చాలా మంది గుండె పోటుకు ఎక్కువగా గురవుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉండి సడెన్‌గా గుండెపోటుకు గురై మృత్యు ఒడికి చేరుతున్నారు.
అయితే.. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కూడా చాలా మందికి గుండె పోటు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఓ వ్యక్తి మెదడు రక్త సరఫరా ఆగిపోతుంది. ఆ సమయంలో తగిన వైద్యం అందకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది.
గుండె పోటు వచ్చే ముందు దాని లక్షణాలు తెలిస్తే.. ఈజీగా ప్రాణాలను కాపాడు కోవచ్చు. మరి గుండె పోటు వచ్చే ముందు దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
విపరీతమైన అలసట: వర్కౌట్ సమయంలో ఉన్నదాని కంటే ఎక్కువ అలసట అనిపించినట్లయితే ఇది గుండె పోటుకు సూచనగా గుర్తించవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: కొన్ని సార్లు Exercise చేసే సమయంలో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో వర్కౌట్ ఆపితే మంచిది.
గుండె వేగంగా కొట్టుకోవడం: వర్కౌట్లు చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటే అది కూడా గుండె పోటుకు సంకేతమే. ఆ సమయంలో వర్కౌట్లు ఆపితే మంచిది.
తలతిరగడం: వర్కౌట్ సమయంలో తల తిరగడం కూడా ప్రమాదమే. జాగ్రత్త వహించడం మంచిది.
ఛాతీ నొప్పి: ముఖ్యంగా వర్కౌట్ సమయంలో ఛాతీ నొప్పి వస్తుందంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. లేకుంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.
నోట్: గుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటే మంచిది. లేకుంటే అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది.