జాతకంలో ఇలాంటివి ఉంటే సన్నాసిగానే మిగిలిపోతారు.. హెచ్చరిస్తున్న జ్యోతిష్యులు

పెళ్లికి ముందు వధువు, వరుడు జాతకాలు కలవకపోతే వివాహం జరిపించడం మంచిది కాదని చాలా మంది పెద్దలు నమ్ముతారు.
జాతకం ఇలాంటి దోషాలు ఉంటే జీవితాంతం పెళ్లి కాకుండానే సన్యాసిగా మిగిలిపోతారని పండితులు హెచ్చరిస్తున్నారు.
వివాహానికి జాతకంలో అశుభ యోగాలను కలిగించే కేతువు, లేదా ఇతర గ్రహాలు ఉండటం వల్ల పెళ్లి జరగడం కష్టమట. ఎంత ప్రయత్నించినా సంబంధం కుదరక ఒంటరిగా మిగిలి పోవాల్సి వస్తుందట.
చంద్రుడు, శుక్రుడు యోగం ఉన్నట్లయితే లేదా శుక్రుడు అశుభ గ్రహాలతో ఉన్నట్లయితే, వివాహం ఒక కలగానే మిగిలిపోతుంది. చంద్రుడు చెడు గ్రహంతో ఉన్నా పెళ్లికి ఆటంకం కలుగుతుంది.
అలాగే గ్రహాలు, ఇతర సమస్యలు ఉన్నా వివాహం జరగకుండా సన్యాసిగా మిగిలిపోతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పెళ్లి చేసుకోవాలని అనుకునే వారు ఇలాంటి ఆటంకాలు ఏమైనా ఉంటే పండితుల సలహా మేరకు పొగొట్టుకునే ప్రయత్నం చేయాలట.
అన్ని రాశులు సఖ్యంగా ఉంటేనే మూడముళ్ల బంధం ఏర్పాడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే ముహూర్తం ఖరారు చేసే సమయంలో జన్మనక్షత్ర జాతకం చూస్తారని పెద్దలు చెబుతున్నారు.
ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.