వేసవిలో బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకూడదంటే.. నీటిలో వీటిని కలుపుకుని తాగాల్సిందే?

రోజు రోజు ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బయటకు రావాటంలేనే జనాలు జంకుతున్నారు.
అయితే ఎండలకు బాడీ డీహైడ్రేషన్‌కు గురై పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే నీటిలో వీటిని కలుపుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయ, పుదీనా కలిపి చేసిన రసాన్ని నీటిలో కలుపుకుని తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు.
అలాగే విటమిన్ సి ఉండే నిమ్మకాయ జ్యూస్‌ను సమ్మర్‌లో తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు వడదెబ్బ బారిన పడకుండా బయట పడవచ్చు.
ఒక స్పూన్ సోంపు గింజలను ఒక బాటిల్ నీటిలో కలిపి మరిగించాలి. అవి చల్లారిన తర్వాత తాగితే వడదెబ్బ, కడుపులో మంట వంటి సమస్యలు రావు.
సబ్జా గింజలను నీటిలో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తగ్గించి మంచి ఫలితాలను కలిగిస్తాయి.