పర్ఫ్యూమ్‌ ఎక్కువగా వాడితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..

పర్ఫ్యూమ్‌ వినియోగించడాన్ని చాలా మంది ఇష్టపడతారు. కాలేజ్, ఆఫీస్, పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వినియోగిస్తారు.
అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
కొన్ని రకాల పర్ఫ్మూమ్స్ కాన్సంట్రేషన్ అధికంగా కలిగి ఉండటంతో తుమ్ములు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. దీంతో అసహనానికి లోనవుతారు.
గాఢత కలిగిన పర్ఫ్యూమ్‌లో ఉండే ఇథనాల్.. పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది.
అంతేకాదు ఇవి ఎక్కువగా వాడితే పెద్దల్లోనూ స్కిన్ అలెర్జీ, ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి.
వీటి తయారీలో వాడే రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పర్ఫ్యూమ్ పడకపోతే ఇలాంటి లక్షణాలు తలెత్తే చాన్స్ ఉంది.
మేకింగ్‌లో యూజ్ చేసే కొన్ని కెమికల్స్ పురుషుడి లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
నోట్: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్, నిపుణులు ఆధారంగా తెలిపినవి మాత్రమే. దీనిని దిశ ధ్రువీకరించడం లేదు.