పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. మీ భాగస్వామితో రోజూ గొడవలేనట!

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు.
అయితే భార్య, భర్త కలిసి ఉండాలంటే భర్త తన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో మహిళలు గమనిస్తారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మహిళలు తన భాగస్వామికి మానసికంగా దగ్గరవ్వాలని కోరుకుంటారు. కానీ, కొంత మంది పురుషులు వారిని అర్థం చేసుకోకుండా ఉంటే రోజూ గొడవలు జరుగుతాయి.
వివాహిత ఒకవేళ ఉద్యోగం చేస్తే భర్త ఇంటి పనుల్లో సహాయం చేయడంతో పాటు బాధ్యతను పంచుకోవాలనుకుంటారు. అలా చేయకుంటే భార్యభర్తల మధ్య కలహాలు వస్తాయి.
భర్త బయటకు వెళ్ళినప్పుడు భార్యకు ఏమైనా కావాలా అని అడగాలి. ఇలా చేస్తే గొడవలు రాకుండా బంధం బలపడుతుంది.
కొంతమంది చిన్న విషయాలను ఎక్కువ సమయం పాటు గుర్తుపెట్టుకుని సాగదీస్తుంటారు. అలాంటి అలవాటును మానుకోవాలి.
కొంత మంది పురుషులు ప్రతి విషయంలోనూ భార్యను నిందిస్తూ తిడుతుంటారు. అలా చేస్తే మహిళలకు నచ్చదు. కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఆ విషయాన్ని అక్కడితోనే మర్చిపోవాలి.