మరమరాలను స్నాక్స్‌గా తీసుకుంటే ఆ వ్యాధులన్నీ పరార్..!

ఎండాకాలం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి సాయంత్రం కాగానే తల్లులు వారికి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతుంటారు.
అయితే చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తినాలంటే మరమరాలను చేసిపెడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మరమరాలలో విటమిన్‌ డి, విటమిన్‌ బి, క్యాల్షియం, ఐరన్‌ వంటివి పుష్కలంగా ఉండి ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా సహాయపడతాయి.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గి నాజుకుగా తయారవుతారు.
మినరల్స్‌, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కడుపు ఇన్ఫెక్షన్, జలుబు, గొంతు నొప్పి, లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి.
అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు మరమరాలను డైట్‌లో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వీటిని ప్రతిరోజూ తినడం వల్ల కడుపు పేగులలో ఆహార కణాలు విచ్ఛిన్నం అయి త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు రావు.
మరమరాలు పిల్లల ఎదుగుదలకు సహాయపడటంతో పాటు వారి మెదడును చురుగ్గా పని చేసేలా చేస్తాయి.