భార్యభర్తలు ఇవి పాటించక పోతే.. ప్రతి రోజూ కలహాలు వస్తాయి: చాణక్య నీతి
ఇటీవల కాలంలో చాలా మంది కూర బాగోలేదని.. లేదా ఏదో కారణంతో భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. కొంతమంది అర్థం చేసుకుని దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తే మరికొంత మంది విడిపోతున్నారు.
అయితే ఆచార్య చాణక్యుడు మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని విషయాలను ఎన్నో వివరించారు. ఇప్పుడు భార్యాభర్తలు కలహాలు రాకుండా ఎలా ఉండాలో అని తెలియజేశారు.
చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమ, అంకితభావం, త్యాగం విషయంలో ఎలాంటి సంకోచం ఉండకుండా బాగస్వామితో పంచుకోవాలి. అలాగే జీవితంలో ఆనందంగా ఉండే అవకాశం దొరికినప్పుడల్లా ఆనందించాలి.
వివాహ బంధంలో అడుగుపెట్టాక భాగస్వామిపై ప్రేమతో పాటు గౌరవం ఉండాలి. అలా చేయడం వల్ల ఇద్దరి బంధం బలపడి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు.
భార్యాభర్త రథానికి రెండు చక్రాల వంటివారు. కాబట్టి భార్యాభర్తలు ఒకరి తప్పులను, చెడు లక్షణాలను ఇతరుల ముందు బయట పెట్టకుండా ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు.
ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంచుకోవచ్చని ఆచార్య చాణక్యుడు సలహా ఇస్తున్నారు.