కొత్తిమీర ఇంత మ్యాజిక్ చేస్తుందా.. దీంతో ఇలా చేస్తే ఇంటినిండా డబ్బులేనంట

కొత్తిమీర గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
ఇది లేకుండా అసలు కూర వండటానికే ఇష్టపడరు మహిళలు.
అయితే కూరలో రుచికే కాదండోయి.. కొత్తిమీరతో అనేక ప్రయోజనాలున్నాయంట.
జ్యోతిష్యశాస్త్రంలో కొత్తిమీరను సుఖ సంతోషాలు, శ్రేయస్సుకోసం ఉపయోగిస్తారంట.
అలాగే కొత్తి మీరతో ఆర్థికపరమైన సమస్యలు కూడా తీరుతాయంట. ఎలా అంటే?
చాలా మందికి డబ్బులు త్వరగా ఖర్చు అవుతుంటాయి..
అలాంటి వారు కొత్తిమీరను ప్రతి బుధవారం ఆవుకు తినిపించడం వలన ఆర్థిక పరిస్థి మెరుగుపడుతుంది.
ఇంట్లో ఎప్పటికీ డబ్బులు ఉండాలంటే.. శుక్రవారం రోజు ఎర్రటి వస్త్రంలో కొత్తిమీరను, వెండి నాణెం పెట్టి పూజ అనంతరం దాన్ని బీర్వాలో పెట్టాలంట.
అప్పులు తిరిగిరాకపోతే.. కాగితంపై రుణగ్రహిత పేరు రాసి అందులో ధనియాలు పోసి, పారే నీటిలో వదిలిపెట్టాలి.
దీని వలన రానీ బాకీలు, మొండి బాకీలు వసూలవుతాయి.