వారంలో ఎన్ని రోజులు తలస్నానం చేయాలి..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..!

ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు అంటే ఇష్టం. మనిషికి ఇంకొంచెం అందాన్ని చేర్చేది జుట్టు అంటారు పెద్దలు.
కానీ, చాలా మంది ఎక్కువగా ఎదురుకునే సమస్యల్లో జుట్టు సమస్య ఒకటి. పొల్యూషన్‌కి, దుమ్మకి జుట్టు ఊడిపోతుంటుంది.
ప్రతి ఒక్కరు జుట్టుపై ఎంతో కేర్ తీసుకుంటారు. జుట్టును పెంచుకునేందుకు ఎన్నో రకాల పద్దతులను ఫాలో అవుతారు. అందులో తలస్నానం ఒకటి.
నూనె పెట్టిన, డెస్ట్ పట్టిన జుట్టును ఫ్రీగా ఉంచేందుకు డైలీ తలస్నానం చేస్తుంటారు.
అయితే.. వారంలో తలస్నానం ఎన్ని సార్లు చేయాలి..? ఎప్పుడు చేయాలి..? అనేవి చెబుతున్నారు నిపుణులు.
అయితే తల స్నానం అనేది.. వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి, జుట్టు రకంపై ఇది ఆధారపడి ఉంటుందట.
జుట్టు జిడ్డుగా ఉంటే ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
అయితే.. పొడి జుట్టు, సున్నితమైన తల చర్మం ఉన్న వ్యక్తులు హెయిర్ వాష్‌ల మధ్య కొన్ని రోజులు విరామం తీసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.
తలకి రంగు వేసుకున్న వారు వెంట్రుకల ఆరోగ్యంతో పాటు వాటి రంగుపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రంగు వేసుకున్న వారు డైలీ తలస్నానం చేసినట్లుయితే కలర్ తొందరగా పోతుంది కాబట్టి గ్యాప్ ఇవ్వడం మంచిది.
కొంతమందికి జుట్టు అడుగు భాగం జిడ్డుగా, చివర్లు పొడిగా ఉంటాయి. ఈ రకం జుట్టు ఉన్నవారు బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించాలి. ఇలాంటి వాళ్లు రెండు, మూడు రోజులుకు ఒకసారి తలస్నానం చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.