వర్షాకాలం బోడ కాకర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని పండ్లు, కూరగాయలు విరివిగా అందుబాటులోకి వస్తుంటాయి. అందులో ముఖ్యమైనవి బోడ కాకరకాయలు.
ఇవి ఎక్కువగా వానాకాలంలోనే మార్కెట్‌లో కనిపిస్తుంటారు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్, జలుబు, ఫ్లూ వంటి వాటిని దూరం చేస్తాయి.
ఈ కూర తింటే చెవి నొప్పి, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో బోడ కాకర సహాయపడుతుంది.
పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా బోడ కాకర మంచి ప్రభావం చూపిస్తుంది.
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ మడతలను మటుమాయం చేస్తాయి. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు వీటిని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
అలాగే రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే బోడ కాకర కూర కచ్చితంగా తినాలి.