వర్షాకాలంలో సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలంటే?

విటమిన్లు, ఖనిజాలు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే సీతాఫలం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ పండు రక్తపోటును తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
మంచి కొలెస్ట్రాల్ ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
సీతాఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడుతాయి.
మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
ఇందులో ఉండే విటమిన్ ఏ, సి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంతో పాటు యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.