ప్రస్తుతం ఎండకాలం మొదలైంది. దీంతో చాలా మంది చెమట వలన ఇబ్బంది పడుతుంటారు.

అయితే చెమట శరీరానికి మంచిదే అయినా కొంతమందికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.
అందువలన మన ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వలన దీన్ని అధికమించవచ్చు.
చెమట సమస్య అధికంగా ఉన్నవారు.. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవాలి
శరీర చెమట దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
గోధుమగడ్డి జ్యూస్, లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు.
రోజుకి మూడుసార్లు భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.
ఉదయం, సాయంత్రం చన్నీటితో స్నానం చేయాలి.