లో బీపీతో బాధపడుతున్నారా.. తప్పనిసరిగా ఈ చిట్కాలు పాటించాల్సిందే?

ప్రస్తుతం చాలా మంది లోబీపీతో బాధపడుతున్నారు.
మహిళల్లో 60/100 mm Hg , మగవారిలో 70/110 mm Hg కంటే తక్కువగా ఉంటే దాన్ని లోబీపీ అంటారు.
నీరసంగా , టెన్షన్ పడడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం ఏ పని చేయాలనుకోకపోవడం వంటివన్నీ లోబీపీ సూచనలే.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను చాలావరకూ తగ్గించుకోవచ్చంటున్నారు వైద్యులు.
లో బీపీ ఉన్నవారు నీరు తాగుతుండాలి. దీనివల్ల శరీరం అలిసిపోకుండా ఉంటుంది.
పండ్ల రసాలు.. దానిమ్మ, బీట్ రూట్ జ్యూస్ ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటుండం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. వీటివల్ల లోబీపీ సమస్య తగ్గుతుంది.
లోబీపీ ఉన్నవారు సరైన సమయానికి నిద్ర పోవాలి. రోజుకి ఖచ్చితంగా 8 గంటలు తగ్గకుండా నిద్రపోవడం వల్ల శరీరం నూతనోత్సాహంతో ఉంటుంది.